నేడు టీడీపీ సభ్యత్వం తీసుకున్నసీనియర్ యాక్టర్
గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా సేవలు
ఆ తర్వాత పార్టీకి దూరం.. కొంతకాలం బిఆర్ఎస్ లో..
ఆ తర్వాత బిజెపిలో.. మళ్ళీ నేడు స్వంత గూటికి..
హైదరాబాద్ – మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆందోల్ నియోజకవర్గంలో సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ఫోట్‌ను షేర్ చేసుకున్నారు. కాగా, బాబు మోహన్ తొలిసారిగా 1998 ఉపఎన్నికలో ఆందోల్ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం 1999లోనూ విజయం సాధించి మంత్రి అయ్యారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరి 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు.
2018లో బీఆర్‌ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ చేతిలో, 2023లో బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహా చేతిలో ఓడిపోయాడు. గత ఏడాది బిజెపి కి కూడా రాజీనామా చేశారు.. ఆ ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ తరుపున పోటీ చేయాలని భావించి ఆ పార్టీలో చేరారు.. అయితే ఒక్క రోజులోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు మళ్లీ స్వంత గూడు టిడిపిలోకి చేరారు.