హైదరాబాద్: సినీనటుడు మోహన్‌బాబు పై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో ఆయనపై తొలుత బీఎన్‌ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదైంది.
తాజాగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు.. 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కుటుంబ వివాదం నేపథ్యంలో మంగళవారం జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు వెళ్లారు. ఈ క్రమంలో మోహన్‌బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు, సహాయకులు.. గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడిచేశారు. ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్‌బాబు మైకు లాక్కుని ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో ఓ ఛానల్ కెమెరామన్ కింద పడ్డాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదైంది.
- Advertisement -