Wednesday, September 18, 2024

TG Assembly – కాసేపట్లో ఆరో రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాదు: కాసేపట్లో ఆరో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదో రోజు(సోమవారం) 17 గంటలకు పైగా జరిగిన శాసనసభ.. వేకువ జామున 3 గంటలల వరకు కొనసాగింది.

19 పద్దులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇవాళ సభ ముందుకు స్కిల్‌ యూనివర్శిటీ బిల్లు రానుంది. మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. నేడు అసెంబ్లీ వేదికగా రూ.లక్షన్నర రుణాల వరకు మాఫీ ప్రకటన చేయనున్నారు.తెలంగాణ శాసనసభ మూడో విడత సమావేశాల్లో ఐదోరోజు 2024-25 వార్షిక బడ్జెట్‌ పద్దులపై సోమ వారం సుదీర్ఘ చర్చ జరిగింది.

సమయపాలన పాటించి డిమాండ్లకు పరిమితమై మాట్లాడాల్సిందిగా స్పీకర్‌ సభ ప్రారంభమైన వెంటనే కోరారు. డిమాండ్లపై చర్చకు సంబంధించి ఒక్కో సభ్యుడికి 15 నిమిషాలపాటు సమయం కేటాయిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.మధ్యాహ్నం మూడు గంటల వరకు చర్చ కొనసాగుతుందని ప్రకటించారు. ప్రశ్నోత్తరాలు లేకుండానే సోమవారం ఉదయం 10గంటలకు సభ ప్రారంభమైన వెంటనే నేరుగా పద్దులపై చర్చ చేపట్టింది . అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 19 పద్దులను సంబంధిత శాఖల మంత్రులు ప్రతిపాదించారు.అయితే సభ్యులు తమకు కేటాయించిన సమయం కంటే ఎక్కువ సేపు ప్రసంగించడం, ఒకేరోజు 19 పద్దులను చర్చించి ఆమోదించాల్సి ఉండటంతో సోమవారం అర్ధరాత్రి దాటినా చర్చ కొనసాగింది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement