Tuesday, November 12, 2024

TG Assembly – కెసిఆర్ చీల్చి చెండాడుతానంటే బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ వేసుకొచ్చా…. రేవంత్ రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – ఇటీవ‌ల బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఇక చీల్చి చెండాతానంటూ అన్నార‌ని, దీంతో నేడు స‌భ‌కు తాను బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ తో వ‌చ్చాన‌ని అన్నారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. కానీ ఇక్క‌డికొస్తే ఆయ‌న స‌భ‌లో క‌నిపించ‌డం లేద‌ని చెప్పారు..ఇక అబ‌ద్దాల‌తో కేటీఆర్ రైతులను రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండి ప‌డ్డారు . ఆరు నెలలు కూడా పూర్తి చేసుకొని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నార‌న్నారు. అసెంబ్లీలో ద్ర‌వ్య‌వినిమ‌య బిల్లుపై నేడు ఆయ‌న చ‌ర్చ‌ను ప్రారంబిస్తూ, బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ బినామీలకు అప్పగించార‌ని,.. సూరత్ నుంచి కిలోల చొప్పున చీరలు తెచ్చి కమీషన్ కొట్టేశారని ఆరోపించారు. పదేళ్లు పాలన చేసిన వారు పది నెలలు పూర్తి చేసుకోని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నార‌న్నారు.. ఎంఎంటీఎస్ ను విమానాశ్రయం వరకు వేస్తామంటే అనుమతి ఎందుకివ్వలేద‌ని నిల‌దీశారు. .. దీని వెనుక ఆర్థిక కుట్ర ఏంటో అందరికి తెలియాల‌న్నారు రేవంత్ ..తాము ఎప్పుడూ మీలాగా పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పలేద‌న్నారు.. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలాగ మార్చుతామనలేద‌ని చెప్పారు.. స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామ‌ని, .. టూరిజం హబ్ క్రియేట్ చేస్తామంటున్నామ‌ని వెల్ల‌డించారు… ప్రపంచస్థాయి వైద్యం హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం అని అన్నారు.

ప్ర‌స్తుతం స్టేడియంలు తాగుబోతులకు అడ్డాగా మారుతున్నాయ‌ని అంటూ ., స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చూస్తున్నామ‌న్నారు.., సిరాజ్.., నికత్ జరిన్ లకి అన్ని మినహాయింపులు ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నామ‌ని రేవంత్ వెల్ల‌డించ‌యారు. ., అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియంకి బీసీసీఐతో మాట్లాడినని చెప్పారు. ఇక బిఆర్ఎస్ ఫార్మా సిటీ అని అంటున్నార‌ని, అయితే ఫార్మా విలేజ్ లు అని నేను అంటున్న అని చెప్పారు. కేటీఆర్ 100 శాతం ఆర్టిపిషల్.. జీరో ఇంటలిజెన్స్ అని కామెంట్స్ చేసారు.

- Advertisement -

బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ తో వచ్చా..

కాగా, కేసీఆర్ చీల్చి చెండాడుతా అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొచ్చి వచ్చానని.. కానీ ఆయన సభకు రాలేదని సెటైర్ వేశారు రేవంత్ . ఎన్నికలు అయిపోయాయని.. ఇకపై ప్రతి దాన్ని రాజకీయం చేయకుండా ప్రతిపక్షంగా మీ పాత్రను నిర్వర్తించండని బీఆర్ఎస్‌కు సూచన చేశారు.

రేవంత్ ప్ర‌సంగంలో….సభను తప్పుదోవ పట్టించటానికి కేటీఆర్‌కు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడానికి చూస్తున్నారు

  • సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళికను ప్రజల మెదళ్లలో చొప్పిస్తున్నారు
  • పదేళ్ల మీ పాలనలో మీ అనుభవాలు మీకు ఉన్నాయి.. ప్రజలకు అనుభవాలు ఉన్నాయి
  • మీ పాలన అనుభవాలతో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు
  • పదేళ్లు పాలన చేసినవారు పదినెలలు పూర్తిచేసుకొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు
  • బతుకమ్మ చీరల పథకంలో అవినీతి జరిగింది – నేత కార్మికులకు పని కల్పించామంటూ అబద్ధాలు చెప్పారు
  • బతుకమ్మ చీరల డబ్బులు బకాయి పెడితే మేం చెల్లించాం
  • బతుకమ్మ చీరల కాంట్రాక్ట్‌ బినామీలకు అప్పగించారు – సూరత్‌ నుంచి కిలోల చొప్పున చీరలు తెచ్చి కమీషన్‌ కొట్టేశారు
  • ఎంఎంటీఎస్‌ను విమానాశ్రయం వరకు వేస్తామంటే అనుమతి ఎందుకివ్వలేదు
  • దీనివెనుక ఆర్థిక కుట్ర ఏంటో అందరికి తెలియాలి
  • మేమెప్పుడు మీలాగా పాతబస్తీని ఇస్తాంబుల్‌ చేస్తామని చెప్పలేదు
  • హుస్సేన్‌సాగర్‌ నీళ్లను కొబ్బరినీళ్లలాగా మార్చుతామనలేదు
  • స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం
  • టూరిజం హబ్‌ క్రియేట్‌ చేస్తామంటున్నాం
  • ప్రపంచస్థాయి వైద్యం హైదరాబాద్‌ నగరంలో అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం
  • ఏషియన్‌ గేమ్స్‌ నిర్వహించిన హైదరాబాద్‌లో.. స్టేడియమ్స్‌ అన్నీ తాగుబోతుల అడ్డాగా మారాయి
  • ఒలింపిక్స్‌లో కాంస్యం వస్తేనే వందకోట్ల మంది సంబరపడే పరిస్థితి
  • నిఖత్‌ జరీన్‌కు ఉద్యోగం ఇస్తామని చెప్పి మీరు ఇవ్వలేదు.. మహమ్మద్‌ సిరాజ్‌కు గ్రూప్‌1 ఉద్యోగం ఇస్తున్నాం
  • ఫార్మాసిటీ అని వాళ్లన్నారు, మేం ఫార్మా విలేజ్‌లు అంటున్నాం
  • వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీలు పెడితే ఆ ప్రాంతమంతా కలుషితమవుతుంది
  • ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నాం
  • కేటీఆర్‌ 100శాతం ఆర్టిఫీషియల్‌, సున్నా శాతం ఇంటెలిజెన్స్‌
  • ముచ్చర్లలో గొప్ప నగరం సృష్టిస్తున్నాం
  • ముచ్చర్లలో నాలుగో నగరాన్ని నిర్మిస్తున్నాం – మన భవిష్యత్‌ నగరంగా ముచ్చర్ల కాబోతుంది – మెట్రో సౌకర్యం కూడా కల్పిస్తాం
  • ఎన్నికలైపోయాయి, ప్రతిపక్షంగా మీ పాత్ర పోషించండి
  • కేసీఆర్‌ చీల్చి చెండాడుతా అంటే బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్‌ వేసుకొని వచ్చా
  • అగ్రికల్చర్‌, ఇండస్ట్రీ, ఐటీ, ఎక్సైజ్‌ పాలసీలు తీసుకొస్తాం
    ప్ర‌భుత్వం తో ప్రతిపక్షం కలిసి వస్తుందని నమ్మడం లేదు..
    2014 నుంచి 2019 వరకు ఐదేళ్లు ఒక్క మహిళకు మంత్రి ఇవ్వలేదు.
    మైనార్టీ కి మంత్రి పదవి ఇవ్వలేదని ముసలి కన్నీరు కారుస్తున్నారు…
    ప్రతిపక్ష నాయకుడు సభకు వచ్చి సహకరించాలి…
Advertisement

తాజా వార్తలు

Advertisement