Friday, November 22, 2024

TG Assembly – న‌ల్ల బ్యాడ్జీల‌తో బిఆర్ఎస్ స‌భ్యులు…రేవంత్, భ‌ట్టి క్ష‌మాప‌ణ‌ల‌కు ప‌ట్టు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – శాసనసభ సమావేశాలు నేటి ఉద‌యం ప్రారంభ‌మైన వెంట‌నే . ‘యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ’ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టారు. ‘యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ’ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి వచ్చారు. అంతకుముందు మహిళా ఎమ్మెల్యేలపై సీఎం వ్యాఖ్యలపై వాయిదా తీర్మానం ఇచ్చారు. ఎమ్మెల్యేలు, సభ ప్రతిష్టకు భంగం కలిగేలా సీఎం వ్యాఖ్యలు చేశారని.. ఆయన వ్యాఖ్యలపై చర్చ కోసం తీర్మానం ఇచ్చింది.

మరోవైపు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం, డిప్యూటీ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిండు శాసనసభలో సీఎం, డిప్యూటీ సీఎంలు మహిళల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించార‌న్నారు. వారి ప్రవర్తన నన్ను ఆశ్చర్యానికి గురిచేసింద‌న్నారు. వెంటనే సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి లు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ప‌ని చేశార‌న్నారు. . ఎంతో హుందాగా, ప్రజలకు సేవ చేసే గుణం వారిద‌న్నారు. అలాంటి మహిళ నేతలను ఇంత చులకనగా మాట్లాడటం సిగ్గు చేట‌న్నారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ఈ వ్యాఖ్యలు వారిద్దరిపై మాత్రమే కాదు మొత్తం మహిళలపై వారికున్నా చులకన భావాన్ని తెలియజేస్తోంద‌న్నారు కెటిఆర్. . కచ్చితంగా మహిళలంతా కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిని గమనిస్తున్నార‌న్నారు.. వారికి సరైన సమయంలో బుద్ది చెప్పటం ఖాయమని కేటీఆర్ అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement