హైదరాబాద్ : పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీతో పాటు ప్రజా పద్దుల సంఘానికి చైర్మన్లను నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి వీ నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, ప్రజా పద్దుల సంఘం చైర్మన్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య నియామకం అయ్యారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి వేముల, గంగుల కమలాకర్, రావూరి ప్రకాశ్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రామ్ రావు పవార్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, భాను ప్రసాద్ రావు, ఎల్ రమణ, సత్యవతి రాథోడ్ నియామకం అయ్యారు.
ఎస్టిమేట్స్ కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, విజయ రమణారావు, కోరం కనకయ్య, రామ్‌దాస్ మాలోత్, యశస్విని మామిడాల, రాకేశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్ రావు, సుంకరి రాజు, టీ రవీందర్ రావు, యాదవ రెడ్డి నియామకం అయ్యారు.
ప్రజా పద్దుల కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద, వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, సంజీవ రెడ్డి, లక్ష్మీ కాంతా రావు, కౌసర్ మోహినోద్దీన్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, తాతా మధుసూదన్, మీర్జా రియాజుల్ హసన్ నియామకం అయ్యారు.
కాగా బిఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన గాంధీకి పిఎసి ఛైర్మన్ పోస్ట్ ఇవ్వడం పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు.. ఈ పోస్ట్ ను విపక్షానికి ఇవ్వడం అనవాయితీ అని గుర్తు చేశారు…