Sunday, December 22, 2024

TG నవోదయాలకు స్థలాలు కేటాయించండి – రేవంత్ కు ఎంపీ అరవింద్ వినతి

నిజామాబాద్ ప్రతినిధి (ఆంధ్రప్రభ)నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో నవోదయల ఏర్పా టుకు సుమారు 20 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ పార్ల మెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి కోరారు.

ఇటీవల కేంద్ర కేబినెట్ జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో నవోద యల ఏర్పాటు చేసిన విష యం తెలిసిందే. ఆదివారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో జగిత్యాల శాసన సభ్యులు డా. సంజయ్ కుమార్ తో ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

ఈ సంద ర్భంగా రెండు జిల్లాల్లో పలు ప్రతిపాదిత స్థలాలను ఎంపీ, సీఎంకు వివరించారు. నిజా మాబాద్ పార్లమెంట్ పరి ధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులను ఎంపీ అర్వింద్ వివరిస్తూ, మాధవ్ నగర్ ఆర్ఓబి 50-50 పద్ధతిలో మంజూరు చేయబడిందని, అడివి మామిడిపల్లి ఆర్ఓబి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధు లతో మంజూరైనప్పటికీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధు లను మళ్ళించిందన్నారు.

కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లు లు అందక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, దీంతో పనుల్లో కొంత జాప్యం జరు గుతుందన్నారు. ఇవేగా కుండా ఇతర ఆర్వోబీల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని, కాంట్రాక్టర్లకు బిల్లు లు మంజూరు చేసి , పను లను త్వరితగతిన పూర్త య్యేలా చొరవ చూపాలని కోరారు.

- Advertisement -

జిల్లాలో ప్రతిపాదిత జక్రాన్ పల్లి ఎయిర్పోర్ట్ పనులకు సంబంధించి ఓఎ ల్ఎస్ సర్వే ని రాష్ట్ర ప్రభు త్వం త్వరితగతిన పూర్తి చేసి కేంద్రానికి నివేదించాలని కోరారు. మరోవైపు జగిత్యా ల పట్టణంలో కేంద్రీయ విద్యా లయం సైతం మంజూరయ్యే దశలో ఉందని, దీనికి కూడా స్థల అన్వేషణ చేయాలని సీఎంని కోరారు.

జగిత్యాల శాసనసభ్యులు డా. సంజ య్ కుమార్ ఎంపీ అర్వింద్ తో కలిసి జగిత్యాల పట్టణా నికి సంబంధించి పలు అభి వృద్ధి కార్యక్రమాల పై ముఖ్య మంత్రితో చర్చించా రు. తమ విజ్ఞప్తుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిం చారని అర్వింద్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement