హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారులు నేడు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా లెక్కలు చూపని నగదును ఏసీబీ బృందాలు సీజ్ చేశాయి. విష్ణుపురం చెక్‌పోస్టులో రూ. 86,500, భోరజ్(ఆదిలాబాద్) చెక్‌పోస్టులో రూ. 62,500, అలంపూర్ చెక్‌పోస్టులో రూ. 29,200 సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ చెక్‌పోస్టుల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. అలాగే మరో ఏడు ప్రాంతాలలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో అందిస్తామని ఎసిబి అధికారులు వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement