Friday, October 18, 2024

TG – 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. 9 శాఖలపై చర్చ

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – 317 జీవోపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో 9 ప్రభుత్వ శాఖలపై చర్చించారు. వివిధ శాఖల అధికారులు వారి శాఖల పరంగా పూర్తి సమాచారం ఇవ్వనందున యుద్ధ ప్రాతిపదికన పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ కమిటీ సమావేశంలో పలు అంశాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడం జరిగింది. పాత జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీస్, ప్రమోషన్ అంశాలను పరిగణలోకి తీసుకొని 317 జీవోను పరిష్కరించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.

- Advertisement -

ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం లో వివిధ శాఖల ఉన్నతాధికారులు నవీన్ మిట్టల్, మహేష్ కుమార్ ఎక్కా దత్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు, అడిషనల్ డీజీ షికా గోయల్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శరత్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీమతి దేవసేన, ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ శృతి ఓజా, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాల కార్యదర్శి శ్రీమతి అలుగు వర్షిని, సోషల్ వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి N. శ్రీధర్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి, ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ, జిఏడి ఉన్నతాధికారులు వినయ్ కృష్ణారెడ్డి, బూసని వెంకటేశ్వరరావు తదితర వివిధ శాఖల ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement