Home తెలంగాణ‌ TG – ఇక బెన్ ఫిట్ షోల‌కు నో ఫ‌ర్మిష‌న్ .. మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వెల్ల‌డి

TG – ఇక బెన్ ఫిట్ షోల‌కు నో ఫ‌ర్మిష‌న్ .. మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వెల్ల‌డి

0
TG –  ఇక బెన్ ఫిట్ షోల‌కు నో ఫ‌ర్మిష‌న్ .. మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వెల్ల‌డి

టాలీవుడ్‌కు బిగ్ షాక్ తలిగింది. తెలంగాణలో ఇకమీదట బెనిఫిట్ షోస్‌కు అనుమతులు ఇవ్వబోమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టంచేశారు. పుష్ప-2 సినిమా కోసం రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతినివ్వగా.. బుధవారం రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్లలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షో వేశారు. ఆ టైంలో అనుకోకుండా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో సహా సినిమా చూసేందుకు సంధ్య థియేటర్కు వచ్చార‌ని విషయం తెలిసి ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.

ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా, ఆమె కొడుకు ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాద ఘటన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతిని నిరాకరించినట్లు సమాచారం. అలాగే కోట్లాది రూపాయిలు కలెక్ష‌న్లు వ‌చ్చాయంటున్న చిత్ర యూనిట్ క‌నీసం చ‌నిపోయిన మ‌హిళ కుటుంబానికి క‌నీసం రూ 25 ల‌క్ష‌లు ఇచ్చి ఆదుకోలేరా అంటూ కోమటిరెడ్డి ప్ర‌శ్నించారు.. ఇంత దుర్ఘ‌ట‌న జ‌రిగితే కనీసం ఆ చిత్ర హీరో ఒక్క మాట కూడా మాట్లాడ‌క‌పోవడం బాధ‌క‌ర‌మ‌న్నారు..

Exit mobile version