Saturday, January 11, 2025

TG – చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్…

హైదరాబాద్ – మెగా స్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ నేడు వెళ్లారు. ఇంటికి వచ్చిన మేనల్లుడిని ఆప్యాయంగా పలకరించారు . సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, అనంతరం జరిగిన పరిణామాలను అర్జున్ తన మావయ్యకు వివరించారు. ఇతర విషయాలను అల్లు అర్జున్‌తో చిరంజీవి కాసేపు ముచ్చటించారు. .

ఇది ఇలా ఉంటే పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందింది. ఈ కేసు విషయంలో అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి చంచల్‌గౌడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రంతా జైల్లోనే బన్నిని ఉంచి మరుసటి రోజు శనివారం విడుదల చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత బన్నిని పలువురు సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. శుక్రవారం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో బన్ని ఇంటికి చిరంజీవి వెళ్లి పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement