వేములవాడ, ఆంధ్రప్రభ : ఖాకీల్లో కర్కశత్వం ఉంటుందని అందరూ అంటారు.. కానీ వారిలో కూడా మానవత్వం ఉంటుందని మరోసారి నిరూపించారు ఓ మహిళ హోంగార్డు. రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు గ్రూప్-2 పరీక్షలు కొనసాగుతుండగా, సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని దామిక డిగ్రీ కళాశాలలో పరీక్ష రాయడానికి ఒక మహిళా అభ్యర్థి తన రెండు నెలల పాపాతో వచ్చారు.
తల్లి పరీక్ష రాయడానికి పరీక్ష కేంద్రంలోకి వెళ్లడంతో నానామ్మ దగ్గర ఉన్న పాపా ఏడుపు అందుకుంది. చిన్నారి ఎంతకీ ఏడుపు ఆపకపోవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డు షాహనాజ్ గమనించి పాపను ఎత్తుకొని లాలించి ఆడించడంతో చిన్నారి ఏడుపు మానింది.
- Advertisement -