Saturday, January 4, 2025

Termination – విధుల‌కు డుమ్మా … 16 మంది ఉపాధ్యాయులు తొలగింపు ..

యాదాద్రి భువనగిరి జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు విధులకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులను, విద్యాశాఖ సీరియస్ గా పరిగణించి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో 16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను వారి సర్వీస్ ల నుండి తొలగించారు. ఈ ఉపాధ్యాయుల్లో 9 మంది మహిళ ఉపాధ్యాయులు కూడా ఉండగా, మొత్తం 16 మంది ఎస్జిటి (స్కూల్ జూనియర్ టీచర్స్) లు సర్వీస్ నుండి తొలగింపుకు గురయ్యారు. ఈ ఉపాధ్యాయులు, సుదీర్ఘ కాలం పాటు విద్యా సంస్థల విధులకు హాజరుకావడం లేదని అధికారులు గుర్తించారు. అలాగే విద్యాశాఖ నుండి పంపిన నోటీసులకు కూడా వారు ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో డిఈఓ (డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్) వారిని సర్వీస్ నుండి తొలగించే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేర‌కు అంద‌రు ఉపాధ్యాయుల‌కు టెర్మినేష‌న్ లెట‌ర్స్ పంపారు అధికారులు .

Advertisement

తాజా వార్తలు

Advertisement