కలెక్టరేట్ ఆడిటోరియంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు, కస్టోడియన్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..పదవ తరగతి పరీక్షలు జాగ్రత్తగా నిర్వహించలవసిన బాధ్యత శిక్షకులకు ఉందని ఆయన సూచించారు. పరీక్ష గదిలో నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ఈ సంవత్సరం 7 పేపర్లు 6 రోజులల్లో నిర్వహిస్తారని ఆయన తెలిపారు. పరీక్ష హాలులో ఏ చిన్న ఇబ్బంది కలిగిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంట్ ఆఫీసర్లపైనే బాధ్యత ఉంటుందని అన్నారు. కోవిడ్ నిబంధనలు అందరూ పాటించే విధంగా చూడాలని, పరీక్షలకు సమయ పాలన పాటించాలని తెలిపారు. పరీక్షలకు సంబంధించిన అన్ని మెటీరియల్స్ అన్నీ ముందుగా సంసిద్దం చేసుకోవాలని, ఓ.ఎం.ఆర్.షీట్లను జాగ్రత్తగా విద్యార్థులకు అందించాలని సూచించారు. మారిన నిబంధనలను ఎప్పటికప్పుడు చూసుకొని పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement