Sunday, November 24, 2024

TG | రామన్నపేటలో టెన్షన్‌.. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి అరెస్ట్

యాదాద్రి భువనగిరి జిల్లాలో​ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రామన్నపేటలో ఏర్పాటు చేయనున్న అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో రామన్నపేటలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కంపెనీ ఏర్పాటును అఖిలపక్షం నేతలు వ్యతిరేకిస్తున్నారు. రామన్నపేటలో అంబుజా సిమెంట్స్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు.

చిట్యాల వద్ద నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే లింగయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద పోలీసులు అరెస్టు చేసి మునుగోడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్ ను, నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డిని.. వీ టీ కాలనీలోని భూపాల్ రెడ్డి నివాసంలో అరెస్టు చేసేందుకు పోలీసులు తమ బలగాలతో అక్కడికి చేరుకున్నారు.

ఎన్జీవోస్ పేరుతో ఇతర రాష్ట్రాల నుండి ఇతర జిల్లాలో నుండి వచ్చిన వారు వెంటనే వెళ్లి పోవాలని, అంబుజా గో బ్యాక్ అంటూ రామన్నపేట మండల ప్రజలు నిరసన తెలుపుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement