నిర్మల్ ప్రతినిధి (ప్రభ న్యూస్) : బాసర త్రిపుల్ ఐటీలో టెన్షన్ నెలకొంది. ఫుడ్ పాయిజన్ కారణంగా 300 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం సమయంలో విద్యార్థులు ఎగ్ కర్రీ, రైస్ తింటుండగా ఈ పరిస్థితి తలెత్తింది. కలుషిత ఆహారం తినడంతో అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. సుమారు 1200 మంది విద్యార్థులు వాంతి చేసుకోగా.. ఇందులో 300 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. వాంతి చేసుకున్నవారికి వారి వారి హాస్టల్ రూముల్లోనే ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. అస్వస్థకు గురైన వారిని అంబులెన్స్‌తో పాటు ఫ్యాకల్టీ కార్లలో త్రిపుల్ ఐటీలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్నిఅత్యంత గోప్యంగా ఉంచి.. మీడియాకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డట్టు తెలుస్తోంది.
Breaking: బాసర త్రిపుల్ ఐటీలో టెన్షన్ టెన్షన్.. ఫుడ్ పాయిజన్‌తో 300మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
Advertisement
తాజా వార్తలు
Advertisement