Friday, September 20, 2024

Tension – ఎమ్మెల్యే కౌశిక్ ఇంటి వ‌ద్ద ర‌ణ రంగం… ఇంటిపై కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు రాళ్ల దాడి

హైద‌రాబాద్ – బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వ‌ద్ద ర‌ణ‌రంగం వాతావర‌ణం నెల‌కొంది.. ఆయ‌న ఇంటిపై పై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి కాంగ్రెస్ కార్య‌కర్తలు దాడి చేశారు. హైదరాబాద్ కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఇంటి కి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నేడు పెద్ద సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌ల‌తో చేరుకున్నారు.. ఈ సంద‌ర్భంగా పాడి ఇంట్లోకి అరికెపూడి గాంధీ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు గేట్లు దూకి చొచ్చుకెళ్లారు. కౌశిక్ రెడ్డిపై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. ఈ ఘటనలో కౌశిక్ ఇంటి కిటికీ గేట్లు ధ్వంసమయ్యాయి. గాంధీ అనుచరులను పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. పోలీసులు, గాంధీ అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement