జూబ్లీహిల్స్‌లో పబ్లో బాలికపై రేప్ ఇన్సిడెంట్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ఘటనలో ప్రజాప్రతినిధుల కొడుకులు ఉన్నారన్న వార్తలతో బీజేపీ లీడర్లు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఇవ్వాల సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. బాధిత అమ్మాయికి న్యాయం చేయాలని, నిందులను కాపాడేందుకు పోలీసులు యత్నించవద్దని కోరుతూ ముట్టడికి యత్నించారు. దీంతో స్టేషన్ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఒక దశలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. పోలీసులను నెట్టుకుని ఠాణాలోకి దూసుకెళ్లడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. అడ్డుకున్న పోలీసులతో పలువురు లీడర్లు వాగ్వాదానికి దిగారు. పీఎస్‌లోకి దూసుకెళ్లి భైటాయించడంతో వారిని వారించి, కాళ్లు, చేతులు పట్టుకుని పోలీసులు బయటకి ఈడ్చేశారు.