జఫర్ గడ్ ప్రభన్యూస్ : ఢిల్లీ లిక్కర్ కుంభ కోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఇటీవల ఆమె ఇంటి ముట్టడికి యత్నించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం పాంనూర్ పాదయాత్రలో భాగంగా బస చేసిన చోటే ధర్మ దీక్షకు దిగారు. అయితే పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ తలపెట్టిన ధర్మదీక్షనుపోలీసులు ఆపేసి స్టేట్ చీఫ్ బండి సంజయ్ ని పాదయాత్ర శిబిరం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో బీజేపీ నేతలు హైకోర్టు నుంచి ఎట్టకేలకు అనుమతి తెచ్చుకున్నారు..
ఇందులో భాగంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం పాంనూరు గ్రామం నుంచి బండి సంజయ్ పాదయాత్ర శుక్రవారం ప్రారంభించారు. అయితే బండి సంజయ్ పాదయాత్ర జనగామ జిల్లా జఫర్ గాడ్ మండలం కూనూరుకు చేరుకోగానే మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బండి సంజయ్ పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బిజెపి కార్యకర్తలు అతడిని అడ్డుకొని చితకబాదారు. దీంతో మళ్లీ టిఆర్ఎస్, బిజెపి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నెలకొని కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు ఇరువర్గాలపై లాఠి చార్జ్ చేసి చెదరగొట్టారు.దీంతో మళ్ళీ హై టెక్షన్ వాతావరణం నెలకొంది..