Tuesday, November 26, 2024

డయాలసిస్ సేవలకు టెండర్లు.. రెండు వేల కోట్లతో ప్రాజెక్టు..

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా ఎక్కడా కూడా సామాజిక సేవలకు సంబం ధించిన టెండర్లలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వా మ్యానికి సంబంధించిన తరహా నిబంధనలు లేవు. అయినా ప్రభుత్వం పేద డయాలసిస్‌ రోగులకు అందించే సేవలను 50 శాతం మేరకు ప్రైవేట్‌ పరం చేయడానికి సంకల్పిస్తోంది. ఇందువల్ల సర్వీస్‌ కాంట్రాక్ట్‌లో చేసే బిడ్డింగ్‌ కన్సార్టియంలో తయారీదారులను కూడా భాగం చేయడం వల్ల పారదర్శకత లోపించ డంతో పాటుగా అవినీతి కూడా భారీగా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నిబంధనల పట్ల ప్రభుత్వ వర్గాల్లోని వ్యక్తులు చెబుతున్న దాని ప్రకారం, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొంటున్న వ్యక్తికి తగిన రీతిలో ప్రయోజనం చేకూర్చేందుకు ఈ వినూత్న నిబంధన తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆ సంస్ధ డయాలసిస్‌ మెషీన్లు, కన్స్యూమబల్స్‌ తయారుచేసే ఒక జపనీస్‌ సంస్థకు పంపిణీదారునిగా వ్యవహరిస్తోంది. అంతేకాదు, ఈ తరహా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఈ డిస్ట్రిబ్య్రూటర్‌ అర్హత సాధించేలా చేయడానికి టెండర్‌ ప్రమాణాలను సైతం దిగజార్చారు. ప్రభుత్వ ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం రూ.25 కోట్ల టర్నోవర్‌ కలిగిన కంపెనీలు ఈ కాంట్రాక్ట్‌ పొందిన తరువాత కొన్ని నెలల పాటు రూ.150 కోట్ల పెట్టుబడులు పెట్టగలవు. పరిమిత అనుభవం, నిధులు కలిగిన ఈ చిన్న కంపెనీలను టెండర్‌ ప్రక్రియలకు అనుమతించడం ద్వారా ప్రభుత్వ ఆరోగ్యశాఖ 21వేల మందికి పైగా డయాలసిస్‌ రోగుల జీవితాలను ప్రమాదంలో నెట్టేయాలనుకోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అంతేకాదు, కొద్దిపాటి మెషీన్లతో రెండు సంవత్సరాల పాటు డయాలసిస్‌ సెంటర్లను నిర్వహించిన అనుభవం గల ఏదైనా కంపెనీకి 8 ఏళ్ల పాటు 100కు పైగా డయాలసిస్‌ సెంటర్ల వ్యాప్తంగా 1250కు పైగా మెషీన్లను నిర్వహించే బాధ్యత అప్పగించనున్నారు. ఆసక్తికరమైన మరొక విషయం ఏమిటంటే ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ఒక్కో డయాలసిస్‌ రోగి చికిత్స కోసం రూ.1450 చొప్పున పీపీపీ కార్యక్రమంలో భాగంగా ఉన్న కంపెనీకి చెల్లించాల్సి వస్తోంది.

సింగిల్‌ యూజ్‌ డయలైజర్‌..

ప్రభుత్వం ఈ డయాలసిస్‌ను సింగిల్‌ యూజ్‌ డయలైజర్‌గా అందించాలని కోరుకుంది. ఈ నిబంధన కూడా తయారీదారులకు అనుకూలంగా ఉంది. ఎందుకంటే, ఎలాంటి అత్యున్నత క్లీనికల్‌ ఫలితాలు లేకుండానే డయలైజర్ల వినియోగం ఎనిమిది రెట్లు పెరగనుంది. అంతేకాదు, ఇది నిజాయితీగా పన్ను చెల్లించే వారిపై అదనపు భారం మోపుతుంది. ఎందుకంటే ఇది ప్రభుత్వంపై అదనపు భారం తెెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు. గత 15 సంవత్సరాల కాలంలో, ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం ఉచితంగా డయాలసిస్‌ చికిత్సను కేవలం రూ. 1250 లకే అందిస్తోంది. అక్కడ ఒకే రోగికి పలుమార్లు డయలైజర్‌ వినియోగించేందుకు అనుమతి ఉంది. ఆరోగ్యశ్రీ పథకం కింద, ప్రభుత్వం ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదు. కానీ పీపీపీ ప్రాజెక్ట్‌లో ప్రభుత్వం సంబంధిత షేరింగ్‌ సంస్థకు ఉచిత భూమి, నీరు, విద్యుత్‌ సైతం అందిస్తోంది.ఈ టెండర్‌ను తీర్చిదిద్దిన విధానం పూర్తిగా ఓ నిర్థిష్టమైన చిన్న డయాలసిస్‌ కన్స్యూమబల్స్‌ డిస్ట్రిబ్య్రూటర్‌, దాని తయారీ భాగస్వామికి ప్రయోజనం చేకూర్చేందుకు మాత్రమే అన్నట్లు-గా ఉందని ఆరోపణలు వినిపిస్తున్‌నయి. పారదర్శక లోపం, పోటీతత్తం లేకపోవడం వంటి విషయాలను వెలుగులోకి వస్తుండటం గమనార్హం. ఏదీఏమైనా పన్ను చెల్లింపుదారులపై ఇది అవాంఛనీయంగా భారం కలిగించనుంది. ఎందుకంటే పీపీపీ పద్ధతిలో టెండర్‌లోని కొన్ని నిబంధనల కారణంగా ప్రాజెక్ట్‌ వ్యయం గణనీయంగా పెరుగుతుం డటమే ఇందుకు కారణంగా నిలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement