Saturday, November 23, 2024

ముగిసిన పది పరీక్షలు.. జూన్‌ 25లోపు ఫలితాలు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పదవ తరగతి ప్రధాన పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఒకేషనల్‌ విద్యార్థులకు మాత్రం జూన్‌1న చివరి పరీక్ష ఉంది. జూన్‌ 25లోపు ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈక్రమంలో జూన్‌ 2 నుంచే స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ ప్రారంభిచనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఈనెల 23న ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది 11 పేపర్లకు బదులు 6 పేపర్లకే పరిమితం చేశారు. సిలబస్‌ను 30 శాతం కూడా తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ను పెంచేశారు. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత మొదటి సారిగా ప్రత్యక్షంగా పరీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయి. పది పరీక్షల నిర్వహణ కోసం 2,861 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 5,09,275 మంది విద్యార్థుల పరీక్షలకు హాజరవుతారని అధికారులు అంచనా వేశారు. అయితే వీటిలో కేవలం ఒక శాతం మినహా 99 శాతం మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు.

సందడి వాతావరణం..

శనివారం సాంఘీక శాస్త్రం పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 5,03,114 మంది విద్యార్థులు హాజరుకాగా, 5029 మంది విద్యా గైర్హాజరయ్యారు. ప్రైవేట్‌ విద్యార్థులు 87 మంది హాజరుకాగా, 80 మంది గైర్హాజరయ్యారు. జగిత్యాల జిల్లాలో ఒక మాల్‌ప్రాక్టీస్‌ కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రధాన పరీక్షలు ముగియడంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి వాతావరణం కనిపించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement