మిరుదొడ్డి : దేవాలయంలో దొంగలు పడ్డారు. దొంగతనానికి గుడి, బడి, ఇల్లు ఇలా ఏది తేడా లేకుండా అన్ని దోచేస్తున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని రామాలయంలో గత రాత్రి దొంగలు హుండీ పగలగొట్టి నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. రాత్రి ఆలయ అర్చకుడు రాజగోపాలచారి ఆలయానికి తాళం వేసి రోజూ మాదిరిగానే వెళ్ళాడు. ఉదయం వచ్చి చూసేసరికి హుండీ పగల గోట్టి ఉండడంతో చోరీ జరిగిందని గ్రహించాడు. విషయాన్ని ఆలయ నిర్వాహకులతో పాటు గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామంలోని పురాతనమైన రామాలయంలో దొంగలు పడ్డారనే విషయం తెలియడంతో విషయం గ్రామంలో దావానలంలా వ్యాపించింది. ఆలయంలో చోరీ చేసిన దొంగలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారంగా వేలిముద్రలను సేకరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..