తెలంగాణలో ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణ ఈరోజు హైకోర్టులో జరగనుంది. కేసును సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ప్రభుత్వం తరపన దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కొనాలని చూశారని అలాంటప్పుడు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడం తప్పు లేదని కోర్టుకు తెలిపారు. అయితే అప్పీల్ పిటిషన్ మొయింటైనబుల్ కాదని నిందితుల తరపు న్యాయవాది వాదించారు. ఈరోజు ప్రతివాదుల తరపు వాదనలు కొనసాగనున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement