హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగులు 48 రోజుల్లో తెలుగు భాషపై పట్టు సాధించేలా తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కోర్సును నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఏ. శ్రీదేవసేన ప్రకటించారు. ‘తెలుగు పరిచయ కోర్సు’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా తెలుగు చదవటం, రాయటంపైశిక్షణ ఇస్తామన్నారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటనవిడుదలచేశారు. కోర్సును 48 పని దినాల్లో సోమవారం నుంచి శనివారం వరకు సా. 5.30 ని. ల నుంచి 7.30 ని.లకు వరకు నిర్వహించనున్నారు.
కోర్సు పూర్తయ్యే నాటికి తెలుగులో మాట్లాడటం, రాయటం, చదవటం కొంత వరకు అలవడుతుందని డైరెక్టర్ తెలిపారు. కోర్సులో ప్రవేశానికి కనీస విద్యార్హతను పదోతరగతిగా నిర్ణయించారు. కోర్సులో చేరాలనుకునే వారు హిమాయత్‌నరగ్‌లోని తెలుగు అకాడమీలో ఈ నెల చివరికల్లా దరఖాస్తు చేసపుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కోసం 040-23226041/040-23225215 నంబర్లను సంప్రదించాలన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..