Saturday, January 4, 2025

Tellapur – ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన అతివేగం

రామచంద్రపురం ,- అతివేగం ఇద్దరు విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కొల్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర కథనం ప్రకారం వివరాలు ఇవి. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూర్ కు పక్కనే రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్ లో నివాసముంటున్న హరీష్, బన్నీ, ఇద్దరు కలిసి సోమవారం రాత్రి 10:45 గంటల సమయంలో రేడియల్ రోడ్డు 15 పైన మోటార్ బైక్ పై తెల్లాపూర్ వైపు వేగంగా వెళ్తున్నారు.

అదే సమయంలో తెల్లాపూర్ లోని హుడా లేఅవుట్ వద్ద యూటర్న్ తిరుగుతున్న టిప్పర్ లారీని బైక్ పై వెళుతున్న యువకులు వేగంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన హరీష్, బన్నీలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారాని ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపారు.

- Advertisement -

మృతదేహాలను పటాన్చెరు లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement