Saturday, November 23, 2024

ముఖ్యమంత్రిని కలిసిన డా.తెల్లం వెంకట్రావు

భద్రాచలం,సెప్టెంబర్ 13 (ప్రభ న్యూస్): భద్రాచలం బారాస అభ్యర్థిగా ఎంపిక కాబడిన డాక్టర్ తెల్లం వెంకట్రావు బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి భద్రాచలం అభివృద్ధి కోసం పలు విజ్ఞప్తులు చేశారు. 530 మీటర్ల కరకట్ట పొడిగించాలంటూ, భద్రాచలం నియోజకవర్గం వెనుకబడి ఉన్నది కాబట్టి స్పెషల్ గ్రాంట్ గా 50 కోట్లు కేటాయించాలంటూ ముఖ్యమంత్రిని డాక్టర్ వెంకట్రావు కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ విషయంపై సానుకూలంగా స్పందించినట్లు తెల్లం వర్గీయులు తెలుపుతున్నారు.

రాష్ట్ర విభజన తరువాత రెండు పర్యాయాలు బారాస అధికారం చేపట్టినప్పటికీ భద్రాచలంలో విజయం సాధించలేకపోయింది. ఈ క్రమంలో ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయించి ఆ పనులు ప్రారంభం అయినట్లయితే కచ్చితంగా బారాసకు విజయ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement