హైదరాబాద్: సినీనటుడు అల్లు అర్జున్ కు రాంగోపాల్ పేట్ పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. మరోవైపు ఆదివారం కూడా అల్లు అర్జున్ కు రాంగోపాల్ పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించేందుకు రావొద్దని అందులో పేర్కొన్నారు. ఆసుపత్రికి ఆయన వస్తున్నారన్న సమాచారంతో నోటీసులు ఇచ్చారు. బెయిల్ షరతులు తప్పనిసరిగా పాటించాలని అందులో సూచించారు. పరామర్శకు వస్తే తమ సూచనలు పాటించాలన్నారు.
- Advertisement -