నిన్న పాలమూరు పర్యటనలో టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బీజేపీకి సవాల్ విసిరారు. కేంద్రానికి తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో నిధులు.. కనీసం మనకు ఇచ్చింది చాలా తక్కువేనని, దాదాపు రెండు లక్షల కోట్లు కేంద్రానికి అదనంగా తెలంగాణ నుంచి ఫండ్స్ ఇచ్చామన్నారు కేటీఆర్. కానీ, కేంద్రంలోని పెద్దలు తప్పుడు మాటలు, అసత్యపు లెక్కలు చెబుతున్నారని, అవి నిజమని నిరూపిస్తే రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నానన్నారు..
కాగా, మంత్రి కేటీఆర్ సవాల్‌కు తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. ‘‘సీఎం కొడుకు బీజేపీకి సవాల్ చేసిండట.. ఆయన తన రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలే.. మేం తెలంగాణకు ఇచ్చిన లెక్కలు, సంక్షేమ పథకాల డిటెయిల్స్ అన్ని వివరంగా ఇస్తాం..”అని బండి సవాల్‌ని స్వీకరిస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడిది తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్ రేపుతోంది.