హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: మహా రాష్ట్రలో సత్తా చాటేందుకు తనదైన శైలిలో ప్రణాళికలు రూపొందిస్తున్న భారత రాష్ట్ర సమితి(భారాస) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక (లోక్‌సభ) ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవా లన్న పట్టుదలతో ఉన్నారు. తెలంగా ణకు పొరుగున ఉన్న మహారాష్ట్ర లోక్‌సభ స్థానాల్లో ఇద్దరు, ముగ్గురు రాష్ట్ర నేతలను బరిలోకి దించేందుకు వ్యూ#హం రచిస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచా రం జరుగుతోంది. #హందీ, ఉర్దూ, మరాఠీ భాషల్లో బాగా పట్టున్న జ#హరాబాద్ భారాస లోక్‌సభ సభ్యుడు బీబీ పాటిల్, నిజామాబాద్ జిల్లా బోధన్ ఏకైక భారాస ఎమ్మెల్యే షకీల్ లేదా ఆయన సతీమణిని మహా రాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థులుగా ఎంపిక చేసేందుకు సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతు న్నాయి. తెలంగాణ మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ లలోనూ లోక్‌సభ ఎన్నికల్లో భారాస తరపున అభ్యర్థులను నిలబెట్టి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఈ దిశగానే ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
నిజామాబాద్‌కు అతి చేరువలో ఉన్న నాందేడ్‌లో భారాసను పటిష్టం చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిన కేసీఆర్ ఈ జిల్లాలోని అన్ని అసెంబ్లి నియోజక వర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామ కమిటీలను నియ మించేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన భారాస భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లోనూ గెలిచి సత్తా చాటాలని నిర్ణయించింది. నాందేడ్‌తో పాటు ఇదే జిల్లాలో నిర్వ#హంచిన భారీ బహరంగ సభల్లో కేసీఆర్ పాల్గొని మరాఠా ఓటర్లకు దిశా నిర్దేశం చేశారు. తాజాగా ఔరంగాబాద్‌లోను సభను జరిపిన సంగతి విదితమే.
నాందేడ్ బరిలో షకీల్?
నాందేడ్ లోక్‌సభ నుంచి బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ను భారాస అభ్యర్థిగా బరిలోకి దింపుతారని పార్టీలో చర్చోప చర్చలు జరుగుతున్నాయి. నాందేడ్ లోక్‌సభలో ముస్లిమ్ మైనార్టీ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉండడం… ఒకప్పుడు నాందేడ్ #హదరాబాద్ రాష్ట్రంలో ఉందని, తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా ఉండడం కూడా భారాసకు కలిసివస్తుందని లెక్కలు వేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో సిక్కుల జనాభా కూడా బాగానే ఉందని చెబుతున్న పార్టీ నేతలు లోక్‌సభకు అభ్యర్థిని నిలబెట్టి సత్తా చాటవచ్చన్న భావనతో ఉంది. షకీల్‌ను లేదా ఆయన సతీమణి అయేషాను నాందేడ్ లోక్‌సభకు పోటీకి పెట్టాలన్న నిర్ణయం జరిగిందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే షకీల్ నాందేడ్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారని, కేసీఆర్ హాజరైన సభల ఏర్పాట్లను మిగతా నేతలతో కలిసి షకీల్ పర్యవేక్షించారని పార్టీ నేతలంటున్నారు. షకీల్ సతీమణి అయేషా నిన్న మొన్నటి దాకా రాజకీయాలకు ఆమడ దూరంలో ఉన్నారని, అయితే రంజాన్ సందర్భంగా ఆమె నాందేడ్‌లో పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలకు చెందిన స్థానిక ముస్లిమ్ మైనార్టీ నేతలను ఆహ్వానించారని సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే షకీల్ లేదా ఆయన సతీమణి లోక్‌సభ బరిలో ఉండడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
లోక్‌సభ బరిలో బీబీ పాటిల్
జహరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌ను సైతం మహారాష్ట్ర లోక్‌సభకు ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా పిట్లం ప్రాంతానికి చెందిన పాటిల్ వ్యాపారరీత్యా మహారాష్ట్రతో దగ్గరి సంబంధాలున్నాయి. ఆయన స్వస్థలం కూడా మహారాష్ట్రకు అత్యంత చేరువలో ఉండడం కూడా కలిసి వచ్చే అంశమని చెబుతున్నారు. పాటిల్ వ్యాపారాలన్నీ మహారాష్ట్రలోనే ఉండడంతో ఆయనను అక్కడి నుంచే లోక్‌సభ బరిలో ఉంచాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. నాందేడ్, ఔరంగాబాద్‌లలో జరిగిన కేసీఆర్ సభల నిర్వహణలో పాటిల్ కీలకంగా వ్యవహరించారు.
మిగతా లోక్‌సభల్లోనూ!
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరువలో ఉన్న యావత్మల్, నాగ్‌పూర్, చంద్రాపూర్ ప్రాంతాలలో భారాస విస్తరణకు, లోక్‌సభ అభ్యర్థులుగా జిల్లా నేతలను ఎంపిక చేసే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. యావత్మాల్, చంద్రాపూర్ జిల్లాల్లో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా ఉండడంతో పాటు చంద్రాపూర్, గుగ్గుస్ ప్రాంతాల్లో ఉన్న సిమెంట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న వారు కొన్ని సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్లి స్థిర నివాసం ఏర్పరచు కున్నారని చెబుతున్నారు. మొత్తం మీద మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నేతలను అభ్యర్థులుగా నిలబెట్టి సత్తా చాటే ప్రయత్నంలో భారాస చీఫ్ కేసీఆర్ ఉన్నారు.