విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ ఎంతో మెరుగ్గా ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో 18,756 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని 25వేల మెగావాట్ల సామర్థ్యాన్ని త్వరలోనే సాధిస్తుందన్నారు సీఎం కేసీఆర్. ఆదివారం అసెంబ్లీలో తెలంగాణ స్థూల వృద్ధిపై జరిగిన చర్యకు సమాధానంగా వివరణ ఇచ్చారు. ఏపీ పునర్వవ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. రాష్ట్రంలో 4వేల మెగావాట్ల ప్లాంట్‌ని నెలకొల్పాలని ఆదేశించిన ఎన్టీపీసీ ఇప్పుడు 1600 మెగావాట్లను మాత్రమే చేపట్టిందని స్పష్టం చేశారు. తలసరి విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని, జాతీయ సగటు రాష్ట్రంలో ఎక్కడా లేదని సీఎం కేసీఆర్ అన్నారు.
“ఈ రోజు మనం 18,756 మెగావాట్లకు చేరుకున్నాము. 25,000 మెగావాట్లకు చేరుకోవాలనే లక్ష్యాన్ని అతి త్వరలో చేరుకుంటాం. 4,000 మెగావాట్ల దామరచర్ల థర్మల్ పవర్ ప్లాంట్ అతి త్వరలో ప్రారంభించబోతున్నాం (మొత్తం) 6,400 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం (ప్రస్తుత సామర్థ్యానికి) ఆడ్ అవుతుంది. దాంతో 25,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం లక్ష్యం నెరవేరుతుంది. ఈ విషయాన్ని నేను సంతోషంగా చెబుతున్నా’’ అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వెల్లడించారు.