Monday, November 18, 2024

పద్మశ్రీ సకిని రామచంద్రయ్యకి సన్మానం

ఆదివాసీ బిడ్డ కోయదొరల ఇలవేల్పు కథకుడు సకిని రామచంద్రయ్యకు పద్మశ్రీ పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పద్మశ్రీ సకిని రామచంద్రయ్య సన్మానం చేశారు. కార్యక్రమంలో గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ పినపాక ఎంఎల్ఎ రేగా కాంతారావు, ఎంపీ కవిత, కార్యదర్శి క్రిస్టినా, గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన 65 ఏళ్ల సకిని రామచంద్రయ్య.. కోయ తెగలోని డోలి ఉపకులానికి చెందిన వారు. రామచంద్రయ్య తన మాతృభాషలో ఆచార గీతాలు పాడుతూ తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కోయ తెగల వంశ చరిత్రలను పారాయణం చేసే వారిలో రామచంద్రయ్యే చివరి వ్యక్తి కావొచ్చేమో.. ఆయన పాటలు వినేందుకు ఆదివాసులు ఎంతగానో ఎదురుచూస్తారు.. ఆయన ప్రదర్శనలు ఇవ్వడానికి ఛత్తీస్‌గఢ్‌‌కు కూడా వెళ్లేవారు. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క సారక్క జాతరలో రామచంద్రయ్యకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. జాతర జరిగే ప్రతీసారి ఆయనకు ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది. ఆ వనదేవతలకు ఆయన డోలు వాయిద్యం వాయిస్తూ పూజలు నిర్వహిస్తారు. ఈసారి కూడా జాతరలో ఆయన డోలు మోగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement