Wednesday, November 20, 2024

పారిశ్రామిక అభివృద్ధి దిశగా తెలంగాణ, విజయవంతంగా దళితబంధు: వినోద్‌ కుమార్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పారిశ్రామిక అభివృద్ధి దిశగా తెలంగాణ ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నరు. ఇప్పటికే రాష్ట్రంలో పట్టణీకరణ పెరుగుతుంది, గ్రామాల్లో సైతం ఎంటర్‌ప్రెన్యూర్‌ కల్చర్‌ కనిపిస్తుందని ఆయన తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో మాదిగ ఇండస్ట్రీయల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ( ఎంఐసిసిఐ – మిక్కీ) ఆధ్వర్యంలో వ్యాపార పెట్టుబడుల అవగాహన సదస్సు జరిగింది.

మిక్కీఫౌండర్‌ మహేష్‌ గోగర్ల అధ్యక్షన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వినోద్‌కుమార్‌, అతిథులుగా ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి రాణి కుముదిని, కర్నాటక రాష్ట్ర మాజీ చీఫ్‌ సెక్రటరీ రత్నప్రభ, నాడం ఛైర్మన్‌ డాక్టర్‌ పగిడిపాటి దేవయ్య, మిక్కీ ఛైర్మన్‌ సుంచు రాజ్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి బక్కా నరసింహా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిక్కీ వెబ్‌సైట్‌ను వినోద్‌ కుమార్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాదిగ సామాజిక వర్గం వారు గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదిగి, ఆర్థిక స్వావలంబనను సాధించాలని పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement