Wednesday, November 20, 2024

విద్యుదుత్పత్తిలో తెలంగాణ టాప్‌.. 73.87శాతం ఉత్పత్తితో టీఎస్‌ జెన్‌కో తొలి స్థానం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: విద్యుత్‌ ఉత్పాదనలో తెలంగాణ జెన్‌కో సంస్థ రికార్డు సాధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 30,447 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను జెన్‌కో థర్మల్‌, జల విద్యుత్‌ కేంద్రాలు ఉత్పత్తి చేశాయి. మూడేళ్ల రికార్డును జెన్‌కో అధిగమించి 73.82శాతంతో తెలంగాణ జెన్‌కో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్‌ 72 శాతంతో పీఎల్‌ఎప్‌తో రెండో స్థానంలో నిలిచింది. దేశంలోని అన్ని 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ యూనిట్లలో కేటీపీఎస్‌ ఏడవ దశ 83.56శాతం పీఎల్‌ఎఫ్‌తో మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీఎస్‌ కూడా దాదాపు 70శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించింది. భారతదేశం మొత్తం సగటు చూసినట్లయితే 58శాతం పీఎల్‌ఎఫ్‌గా నిలిచింది. 2021-22లో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల ఉత్పాదక సామర్థ్యం 73.82శాతం నమోదు కాగా, 2020-21లో 70.64శాతం, 2019-20లో 71.86శాతం పీఎల్‌ఎఫ్‌ నమోదైంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని విద్యుత్‌ సంస్థల్లో జెన్‌కోను మొదటి స్థానంలో నిలిచినందుకు జెన్‌కో ఉద్యోగులను టీఎస్‌ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement