Sunday, November 17, 2024

Telangana – నేడు అటుకుల బ‌తుక‌మ్మ‌తో ఆటాపాట‌

తొలి రోజు వైభ‌వంగా ఎంగిలిపూల బ‌తుక‌మ్మ‌
న‌గ‌ర‌,ప‌ట్ట‌ణ ప‌ల్లెల‌లో ఆడ‌ప‌డుచుల జోష్
క‌నువిందుగా సాగుతున్న బ‌తుక‌మ్మ సంబురాలు

హైదరాబాద్ – తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. ఆశ్వయుజ మాసంలో భాద్రపద అమావాస్య రోజు నుంచి బతుకమ్మ సంబురాలు మొదలవుతాయి. తొలిరోజైన నిన్న ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ వేడుకలు షురూ అయ్యాయి. తొలి రోజునే న‌గ‌ర‌, ప‌ట్ట‌ణ , గ్రామాల‌లోని అడ‌ప‌డుచులు ఉత్సాహంగా సంబ‌రాల‌లో పాల్గొన్నారు.. పూల బ‌తుక‌మ్మ‌ల చుట్టు ఆడి పాడి అల‌రించారు.

- Advertisement -

కాగా, తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు తెలంగాణ ఆడపడుచులు. రెండో రోజైన నేడు అటుకుల బతుకమ్మను తయారు చేస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకులు బతుకమ్మను జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ బతుకమ్మను చిన్నపిల్లలు చేస్తుంటారు. అలాగే అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. అటుకులు నైవేద్యంగా ఇవ్వడం వల్లే ఈ పండుగకు అటుకుల బతుకమ్మ అనే పేరువచ్చిందని చెబుతుంటారు మన పెద్దలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement