హైదరాబాద్ – మూడు నెలల్లో బీసీ కుల గణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. బీసీ కులగణన చేయాలని హైకోర్టులో బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం నాడు సీజే ధర్మాసనం విచారించింది. బీసీ కుల గణనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పిటిషనర్ తరపున న్యాయవాది నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు.
ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ కులగణన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోర్టుకు తెలిపారు. దీంతో మూడు నెలల్లో బీసీ కులగణన చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది..
- Advertisement -