Friday, November 22, 2024

తెలంగాణ‌లో చండ్ర నిప్పులు – మహదేవ్‌పూర్, మల్లాపూర్‌ లలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు ..

హైద‌రాబాద్ – మే నెల రాక‌ముందే తెలంగాణాలో తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. బుధ‌వారం నాడు తెలంగాణ‌లోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా జయశంకర్‌ భూపాపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు 44.5 గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రాంతాల వారిగా ఉష్ణోగ్ర‌త‌లు చూసుకుటే తలమడుగు (ఆదిలాబాద్‌) 44.3, కీతవారిగూడెం (సూర్యాపేట) 44.2, వెల్గటూరు (జగిత్యాల) 44.2, కొల్లాపూర్‌ (నాగర్‌కర్నూల్‌) 44, తాడ్వాయి (ములుగు) 44, గరిమెల్లపాడు (భద్రాద్రి కొత్తగూడెం), 44, కొమ్మెర (మంచిర్యాల) 43.9, చప్రాలా (ఆదిలాబాద్‌) 43.9, భిక్కనూర్‌ (కామారెడ్డి) 43.8, పజ్జూర్‌ (నల్లగొండ) 43.8, ధర్మసాగర్‌ (హన్మకొండ) 43.8, జైనత్‌ (ఆదిలాబాద్‌) 43.7, పాత కొత్తగూడెం (భద్రాద్రి కొత్తగూడెం) 43.7, సుజాతనగర్‌ (భద్రాద్రి కొత్తగూడెం) 43.7, కొండాపూర్‌ (మంచిర్యాల) 43.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్‌ జంటనగరాల పరిధిలోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement