వ్యవసాయ, ఉద్యాన పంటలు, వాటి ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పరిశీలనకు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా జలగాన్ లోని జైన్ హిల్స్ లోని అగ్రిటెక్, హార్టీ క్రాప్స్ ను శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఆయనతోపాటు భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి , ఉద్యాన వాన శాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, ఉద్యాన వన శాఖ జేడి సరోజినిదేవి, అసిస్టెంట్ డైరెక్టర్ సుభాషిణి సందర్శించారు. టిస్యూ కల్చర్ ద్వారా అక్కడ అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ సాగు చేస్తున్న మామిడి, జామ జైన్ స్వీట్ ఆరంజ్, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అల్లం,ఆలు, టొమాటో పంటల సాగును పరిశీలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement