తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవితోపాటు పార్టీకి రాజీనామా చేసిన ఎల్.రమణపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. ఏడు సంవత్సరాలుగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ పార్టీ ప్రతిష్ఠను దిగజార్చారని ఆపార్టీ నాయకులు ఆరోపించారు. నాయకులు మారినంత మాత్రాన టీడీపీకి ఎలాంటి నష్టం లేదని, కార్యకర్తలే దేవుళ్ళు అని వారు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి గత ఏడేళ్లుగా పట్టిన శని వదిలి పోయిందన్నారు. ఎల్.రమణను కాకుండా ఐరన్ లెగ్ రమణను పార్టీలో చేర్చుకుంటున్న కేసీఆర్ అంటూ రమణది ఐరన్ లెగ్ అని అభివర్ణించారు. ఇంత కాలం తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా లేకపోవడానికి రమణ నాయకత్వమే కారణమని ఆరోపించారు. ఇక నూతన నాయకత్వంలో భవిష్యత్తులో పార్టీ మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రమణ వెళ్లిపోవడం శుభసూచకమని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: టీ.టీడీపీకి ఎల్.రమణ రాజీనామా