Saturday, November 9, 2024

Missing : అమెరికాలో తెలంగాణ విద్యార్ధి మిస్సింగ్

షికాగోలో మాస్ట‌ర్స్ డిగ్రీ చేస్తున్న రూపేష్
ఈనెల రెండో తేది నుంచి మాయం
దృవీక‌రించిన భార‌త రాయ‌బార కార్యాల‌యం
అత‌డి కోసం గాలిస్తున్న అక్క‌డి పోలీసులు

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి కనిపించకుండా పోయాడు. తెలంగాణకు చెందిన రూపేశ్‌ చంద్ర చింతకింది షికాగోలో అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతని ఆచూకీ లేదని భారత రాయబార కార్యాలయ అధికారులు వెల్ల‌డించారు. రూపేశ్‌ ప్రస్తుతం షికాగోలోని విస్కాన్సిన్‌లో ఉన్న కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుతున్నాడు.

భారత్‌కు చెందిన రూపేశ్‌ మే 2వ తేదీ నుంచి కన్పించడంలేదని, అతడి ఆచూకీ కోసం పోలీసులు, ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామ‌ని చెప్పారు.. త్వరలోనే అతని జాడ తెలుస్తుందని ఆశిస్తున్నామని అక్క‌డి అధికారులు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. కాగా, రూపేశ్‌ గురించి తెలిస్తే తమకు సమాచారం అందించాలంటూ పోలీసులు స్థానికులను కోరారు.

ఉన్నత విద్యకోసం వెళ్లిన తమ కుమారుడి జాడ తెలియకపోవడంతో అతని తల్లిదండ్రులు ఆందోళనకు గురవతున్నారు. రూపేశ్‌ ఆచూకీ కనుక్కోవాలంటూ భారత విదేశాంగ మత్రిత్వ శాఖను, అమెరికా ఎంబసీని అభ్యర్థించారు. ఇదే విష‌యాన్ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా రూపేష్ పేరేంట్స్ తీసుకెళ్లారు. త‌మ కుమారుడిని సుర‌క్షితంగా ఇక్క‌డకు ర‌ప్పించాల‌ని అభ్య‌ర్దించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement