Monday, November 18, 2024

తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో నెంబెర్ వన్.. ఆటా మహాసభల్లో మంత్రి వేముల

ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నుంబెర్ వన్ గా ఎదిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అమెరికా లోని వాషింగ్టన్ డిసిలో జరిగిన 17వ ఆటా మహసభలకు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు. అమెరికాలో వివిధ ప్రాంతాల్లో డాక్టర్స్ , ఐటీ వంటి వివిధ రంగాల్లో స్థిరపడి తెలుగు వారి గౌరవాన్ని కాపాడుతున్న ప్రవాస భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. 17 వ ఆటా మహా సభల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మీ కృషి వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఆయా రంగాల్లో మీ విజయాలు చూపిస్తున్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాలు అమెరికాలో ప్రత్యేక చోటు సంపాదించుకున్నాయని మంత్రి వేముల‌ అన్నారు. దేశం కాని దేశంలో మ‌న తెలుగు పండుగలు, సంస్కృతి సంప్రదాయాలను గొప్పగా చాటుతూ ఈ మహా సభలు నిర్వహించారని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నఅభివృద్ధిలో ప్రవాస భారతీయులు కూడా భాగస్వాములు కావాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం క్యాపిటల్ డేవలప్ మెంట్ లో అన్ని రంగాల్లో నెంబెర్ వన్ గా ఉందని అన్నారు. అభివృద్ది కి ప్రూఫ్ ఏంటి అంటే ఈ మధ్యనే రిజర్వ్ బ్యాంక్ ఓ హ్యాండ్ బుక్ ని రిలీజ్ చేసిందని తెలిపారు. తలసరి ఆదాయంలో తెలంగాణ మూడవ ప్లేస్ లో ఉందన్నారు. కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డీ, ముత్తి రెడ్డి యాద‌గిరిరెడ్డి, ఆటా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement