Friday, November 22, 2024

దేశానికే ఆదర్శం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…. చేవెళ్ల మాజీ శాసనసభ్యుడు కేఎస్ రత్నం

శంకరపల్లి (ప్రభ న్యూస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దేశానికి ఆదర్శవంతమైన ప్రభుత్వంగా కొనసాగుతున్నదని చేవెళ్ల మాజీ శాసనసభ్యులు కేఎస్ రత్నం అన్నారు పల్లె పల్లెకు రత్నం అన్న కార్యక్రమంలో భాగంగా శనివారం మండల పరిధిలోని మోకిలా మోకిలా తండా కొండకల్ కొండకల్ తండా గ్రామాలలో ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందని వారు ఉండరని ఆయన పేర్కొన్నారు ఈ దఫా శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సరిత రాజు నాయక్ సురేందర్ రెడ్డి నాయకులు నరసింహ మాజీ ఎంపీపీ శ్రీనాథ్ మున్సిపల్ కౌన్సిలర్ యాదయ్య బయన్న శ్రీనివాస్ రెడ్డి రవి గోవింద్ రెడ్డి తదితరులు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement