Tuesday, November 26, 2024

TS: తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి : మంత్రి తలసాని

అమీర్ పేట్ : అభివృద్ధి పనులు జరిగినా… ప్రజా సమస్యలు పరిష్కారమైనా అది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్ నగర్, అమీర్ పేట డివిజన్లలో 96 లక్షల రూపాయల విలువైన 7 అభివృద్ధి పనులను సోమవారం అయన ప్రారంభించారు. సనత్ నగర్ డివిజన్ లోని ఇండస్ట్రియల్ ఏరియాలో 18లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వాటర్ లైన్ పనులను ప్రారంభించారు.

ఎస్ ఆర్ టి కాలనీలోని కోవెల్స్ హైస్కూల్ వద్ద 18.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వాటర్ లైన్ పనులను, అదేవిధంగా రాంరెడ్డి హాస్పిటల్ వద్ద 8.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ లైన్, ఎస్ ఆర్ టి కాలనీలో 16లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ లైన్, అమీర్ పేట డివిజన్ లోని రేణుక నగర్ లో 11.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వాటర్ లైన్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు సమీపంలో 16.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వాటర్, సీవరేజ్ లైన్, సత్యం థియేటర్ వద్ద 7లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ లైన్ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో జరిగాయని చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement