Sunday, September 15, 2024

Telangana – ఇక పాఠశాలల్లో స్పోర్ట్స్ పీరియడ్ మస్ట్ : ఉప ముఖ్య‌మంత్రి భట్టి

ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభం
ప్ర‌తి ఏటా పాఠ‌శాల‌లో క్రీడా పోటీలు
గ్రామీణ క్రీడాల‌కు ప్రాధాన్య‌త ఇస్తాం
క్రీడా న‌గ‌రంగా హైద‌రాబాద్ ను చేస్తాం
ఒలింపిక్స్ లోనూ తెలంగాణ బిడ్డ‌లు రాణింపు
ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క అభిభాష‌ణ

హైద‌రాబాద్ -ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో తప్పనిసరిగా స్పోర్ట్స్ కు సంబంధించిన పీరియడ్ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్ బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఉద్యోగుల క్రీడా పోటీలను నేడు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు.

- Advertisement -

ప్రపంచ స్థాయిలోనే తెలంగాణ నుంచి అద్భుతమైన క్రీడాకారులు తయారు కావాలని జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో తెలంగాణకు ప్రాధాన్యం పెరిగేలా కృషి చేస్తామని అన్నారు. ఇందు కోసం హైదరాబాద్ లో జాతీయ క్రీడలను నిర్వహించేలా కేంద్రాన్ని అనుమతి కోరతామని అన్నారు. ఇప్పటికి క్రీడలు నిర్వహించుకునేందుకు నిధుల కొరత లేదని అన్నారు. భవిష్యత్ లోనూ క్రీడా నిధులు పెంచేందుకు కృషి చేస్తామని అన్నారు. తగిన శారీరక శ్రమను ఇచ్చే క్రీడలు లేక విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారని..చిన్నప్పటినుంచే వారిని శారీరక శ్రమను ఇచ్చే క్రీడలకు సంసిద్ధం చేసే దిశగా పాఠశాలలు కృషి చేాలని అన్నారు.

పిఈటీ పోస్ట్ ల‌ను పెంచుతాం..

ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగి వుండాలని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్ వేదికలపై తెలంగాణ క్రీడాకారులు విజయాలు సాధించాలని అన్నారు. గత పాలకుల హయాంలో కేటాయించిన క్రీడా సామాగ్రి, క్రీడా ప్రాంగణాలను తగిన రీతిగా మరమ్మతులు చేయించి ఉపయోగించుకుంటామని..తప్పని సరిగా పాఠశాల దశ నుంచే క్రీడా స్ఫూర్తిని ప్రతి విద్యార్థి కలిగి వుండాలని తమ ధ్యేయమని అన్నారు. ఇందుకోసం అవసరమైతే క్రీడా ఉపాధ్యాయ పోస్టులను పెంచుతామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement