హైదరాబాద్ – నాంపల్లిలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశుసంవర్ధక శాఖ కేసులను తెలంగాణ ప్రభుత్వం ఏసీబీకి బదిలీ చేసింది. ఫైల్స్ మాయం, నిధుల స్వాహా కేసులను ఏసీబీకి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గొర్రెల పంపిణీ నిధుల బదిలీల్లో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలింది.. ఇప్పటికే పలువురిపై అక్రమాలపై కేసులు నమోదయ్యాయి.. నకిలీ బ్యాంక్ ఖాతాలు తెరిచి మొత్తం రూ.2 కోట్లకు పైగా నిధులు దారిమళ్లించారనే అభియోగాలు అధికారులపై నమోదయ్యాయి.. అయితే ఇదే కేసులో ఇటీవల గచ్చిబౌలి పోలీసులు నలుగురిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.. తాజాగా ఈ కేసును ఏసీబీకి బదిలీ చేశారు.
Scam – రూ.2 కోట్లకు పైగా గొర్రెల పంపిణీ సొమ్ము స్వాహా…కేసు ఎసిబికి బదిలీ ..
Advertisement
తాజా వార్తలు
Advertisement