తెలంగాణ సచివాలయంపై ప్రశంసలు కురిపించారు ఎంపీ, దర్శకుడు, రచయిత (బాహుబలి) విజయేంద్రప్రసాద్.భావితరాలకు దిక్సూచిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అంబేద్కర్ సచివాలయాన్ని ముందుచూపుతో అద్భుతంగా నిర్మించారన్నారు. ప్రముఖ నిర్మాత, బీఆర్ఎస్ రాష్ట్ర నేత కొణతం లక్ష్మణ్, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవతో కలిసి ఆయన నూతన సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం ఎంపీ సంతోష్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమయ్యారు. అతి తక్కువ సమయంలో, తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన కట్టడాన్ని సీఎం కేసీఆర్ నిర్మించారని విజయేంద్రప్రసాద్ కొనియాడారు.