పెద్దపల్లిలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 కే రన్ ఘనంగా నిర్వహించారు. సోమవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఐటిఐ మైదానంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జెండా ఊపి టు కే రన్ ను ప్రారంభించారు. ఈ రన్ లో వేలాదిగా యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐటిఐ మైదానం వద్ద ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్, ప్రగతి నగర్, అమర్ నగర్, జెండా, కమాన్ మీదుగా జూనియర్ కళాశాల మైదానం వరకు సాగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రతినిత్యం తప్పనిసరిగా వ్యాయామం అలవర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ మమతారెడ్డి, ఏసీపి మహేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తో పాటు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.