హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక ఫోరం వేదికగా తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడుల రికార్డు నమోదు చేసింది.
16 ప్రముఖ కంపెనీలు సుమారు రూ.1.78 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు 49,550 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది
. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, ఆశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు దావోస్ పర్యటనలో పాల్గొన్నారు.
16 ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు
1. సన్ పెట్రో కెమికల్స్: భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటు. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లు. 3400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో విద్యుత్తు. 5440 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు. రూ. 45,500 కోట్ల పెట్టుబడులు.. 7వేల ఉద్యోగాల కల్పన.
2. అమెజాన్ వెబ్ సర్వీసెస్: ఏఐ, క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లలో భారీ పెట్టుబడులు. రూ.60,000 కోట్ల భారీ పెట్టుబడి.
3. కంట్రోల్ ఎస్ (CtrlS): తెలంగాణలో అత్యాధునిక ఏఐ డేటాసెంటర్ క్లస్టర్. 400 మెగా వాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్. రూ. 10,000 కోట్ల పెట్టుబడితో 3,600 మందికి ఉపాధి.
4. జేఎస్ డబ్ల్యూ: రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు క్రియాశీలంగా మారనుంది. రూ.800 కోట్ల పెట్టుబడులు, 200 ఉద్యోగాలు.
5. స్కైరూట్ ఏరో స్పేస్: తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు. రూ.500 కోట్ల పెట్టుబడులు
6. మేఘా ఇంజినీరింగ్ (MEIL) మూడు కీలక ఒప్పందాలు: రాష్ట్రంలో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ప్రాజెక్టు. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్. రూ.15000 కోట్ల పెట్టుబడులు, 5,250 మందికి ఉపాధి.
7. హెచ్‌సీఎల్ టెక్ సెంటర్: హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్. 5వేల మందికి ఉపాధి.
8. విప్రో: హైదరాబాద్‌లో విప్రో కంపెనీ విస్తరణ. గోపన్‌పల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్. 5వేల మందికి ఉద్యోగాలు.
9. ఇన్ఫోసిస్: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ క్యాంపస్ విస్తరణ. పోచారంలో ఐటీ క్యాంపస్‌లో కొత్త సెంటర్. రూ.750 కోట్ల పెట్టుబడులు.. 17,000 ఉద్యోగాలు.
10. యూనిలివర్ కంపెనీ: కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్. రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌లను ఉత్పత్తి చేసే కొత్త తయారీ యూనిట్ ఏర్పాటు. దాదాపు వెయ్యి ఉద్యోగాలు.
11. టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్: హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెంటర్ ఎర్పాటు. 300 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు. రూ.15,000 కోట్ల పెట్టుబడులు
12. ఉర్సా క్లస్టర్స్: అమెరికాకు చెందిన కంపెనీ ఉర్సా క్లస్టర్స్ అత్యాధునిక అర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్‌ను స్థాపించనుంది. రూ. 5000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
13. బ్లాక్‌స్టోన్: ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్‌స్టోన్ హైదరాబాద్‌లో 150 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ₹4,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
14.అక్షత్ గ్రీన్ టెక్ (మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ): అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. రూ.7,000 కోట్ల పెట్టుబడులు
.15. ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్: ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలో పేరొందిన ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ దాదాపు 800 మంది ఉద్యోగులు పనిచేసేందుకు వీలుగా హైదరాబాద్‌లో నూతన కార్యాలయం ఏర్పాటు.
16. సుహానా మసాలా, ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్: సంగారెడ్డిలో ప్రస్తుతమున్న సుహానా ప్లాంట్ పక్కనే కొత్తగా ఎక్సెలెన్స్ సెంటర్ ఏర్పాటు చేయనుంది.