Monday, November 18, 2024

Telangana – ఇక్కడ కాలు పెట్టాలంటే .. వెన్నులో వణుకు పుట్టాలి – రేవంత్ రెడ్డి

సామాజిక నేరగాళ్లను తరిమి కొడ‌దాం
తెలంగాణ ప్ర‌జ‌లు దేనికీ బానిసలు కావొద్దు
ఇదీ సామాజిక చైతన్య ఉద్యమాల గడ్డ
డ్రగ్స్, మాదక ద్రవ్యాల ద్వారా సమాజం సర్వ నాశనం
మర్డర్, రేప్ తీవ్రమైన నేరాలు
ఇప్పుడు సైబర్ నేరాలు, డ్రగ్స్ పెను సవాళ్లు
ఇకపై ప్రతి సినిమాకు ముందు రెండు నిమిషాల అవగాహన వీడియో తప్పనిసరి
ఆ వీడియోలు తీసే బాధ్యత ఆ డైరెక్టర్లకు అప్ప‌గిస్తాం
పోలీసులకు ప్రతిభ ఆధారిత పదోన్నతులు, ప్రోత్సాహకాలు
సైబర్ సెక్యూరిటీ వాహనాల ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి

గంజాయి మత్తులో నేరాలు అధికంగా జరుగుతున్నాయని అభిప్రాయ‌ప‌డ్డారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి . వాటిని అరిక‌ట్టేందుకు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేయాల‌ని పోలీస్ ల‌ను కోరారు.. . నేరాలు అరికట్టేందుకు కృషి చేసిన అధికారులకు ప్రత్యేక గుర్తింపునిస్తామని హామీ ఇచ్చారు. క‌మాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆయ‌న నేడు టిజి న్యాబ్, సైబ‌ర్ కంట్రోల్ వాహ‌నాల‌ను లాంచ‌నంగా ప్రారంభించారు.. అనంత‌రం నార్కొటిక్ బ్యూరో ఏర్పాటు చేసిన ఫోటో ప్ర‌ద‌ర్శ‌న‌ను తిల‌కించారు. అనంత‌రం పోలీస్ ఉన్న‌తాదికారులతో మాట్లాడుతూ, డ్రగ్స్, సైబర్ క్రైమ్ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని తెలిపారు. మీడియా కూడా వీటిపై ఫోకస్ పెంచాలని రిక్వెస్ట్ చేశారు.

- Advertisement -

తెలంగాణ లో నేర‌స్తులు కాలు పెట్టాలంటే.. వెన్నులో వణుకు పుట్టాల‌ని అన్నారు.. సామాజిక నేరగాళ్లను తరిమి కొట్టాల‌ని పిలుపు ఇచ్చారు రేవంత్ .. ఇది సామాజిక చైతన్య ఉద్యమాల గడ్డ అని అంటూ తెలంగాణ ప్ర‌జ‌లు దేనికీ బానిసలు కావొద్దని హిత‌వు ప‌లికారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల ద్వారా సమాజం సర్వ నాశనమ‌వుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మీరు ఎంతో తీసుకుంటున్నారు… మాకు కొంత ఇవ్వండి..

మర్డర్, రేప్ తీవ్రమైన నేరాలని ఇప్ప‌డు వాటికి తోడు సైబర్ నేరాలు, డ్రగ్స్ పెను సవాళ్లు గా మారాయ‌న్నారు ముఖ్య‌మంత్రి. డ్రగ్స్ నియంత్రణ కోసం చిరంజీవి వీడియో సందేశం పంపారని.. డ్రగ్స్ నియంత్రణకు అలాంటి వాళ్లు చాలా మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్న సినిమా వాళ్లు తిరిగి కొంతైనా ఇవ్వాల్సిందే అని రేవంత్ రెడ్డి అన్నారు. సమాజాన్ని కాపాడే బాధ్యత సినీ ఇండస్ట్రీపై ఉందని తెలిపారు. థియేటర్లలో డ్రగ్స్ నియంత్రణ కోసం ఉచితంగా వీడియో ప్రదర్శించాలన్నారు. అలాగే సందేశాత్మ‌కంగా ఉండే వీడియోలు ద‌ర్శ‌కులు తీయాల‌ని కోరారు. ప్ర‌తి ప్రతి సినిమాకు ముందు 2ని. అవగాహన వీడియో తప్పనిసరిగా ప్ర‌ద‌ర్శించాల‌ని ఎగ్జిబిట‌ర్స్ కోరారు రేవంత్ ..

Advertisement

తాజా వార్తలు

Advertisement