Monday, November 11, 2024

Telangana – రేవంత్ కేబినెట్ నిర్ణ‌యాలు ఇవే….

హైద‌రాబాద్ – ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీకి ఎకరానికి రూ.250 చొప్పున భూమికేటాయింపులకు రేవంత్ కేబినెట్ ఆమోదం తెలిపింది. మద్నూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసేందుకు మంత్రి మండలి అంగీకరించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

అలాగే, హన్మకొండ , వరంగల్ జిల్లాల పరిధి పెంపునకు ఆమోదం తెలిపింది. ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు గ్రీనిసిగ్నల్ ఇచ్చింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్‌పై చర్చించిన కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.

- Advertisement -

రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర 7వేల పై చిలుకు కోట్ల అప్పు కోసం కేబినెట్ అనుమతిపై చర్చించారు. 30వేల కోట్లు కేంద్ర సంస్థల దగ్గర రుణాలు తీసుకోవడం కోసం .రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని రోడ్లు తనఖా పెట్టడానికై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపుపై చర్చ జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement