Friday, November 22, 2024

Telangana – ఉద్యోగాల కోసం బిక్షాట‌న‌… గాంధీభవన్ వద్ద నిరసన … గురుకుల అభ్య‌ర్ధుల‌కు హ‌రీశ్ మ‌ద్ద‌తు..

హైద‌రాబాద్ : గురుకుల అభ్యర్థుల నిరసనకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అభ్యర్థుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరం అని హ‌రీశ్‌రావు అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ చేశారు.. మంత్రులు, అధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, సీఎం ఇంటి ముందు మోకాళ్ళ మీద నిలబడి ఎన్నిసార్లు అభ్యర్థించినా అభ్యర్థుల మొర అలకించకపోవడం శోచనీయమ‌ని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అత్యున్నత, నాణ్యమైన రెసిడెన్షియల్‌తో కూడిన విద్యను పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేసింది అని మాజీ మంత్రి గుర్తు చేశారు.

పెద్ద‌మ్మ టెంపుల్ వ‌ద్ద బిక్షాట‌న …

ఇది ఇలా ఉంటే త‌మ ఉద్యోగాలు ఇప్పించండి అంటూ పెద్దమ్మ గుడి ముందు గురుకుల అభ్యర్థులు భిక్షాట‌న చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన తెలపడానికి అనుమతించకపోవడంతో పెద్దమ్మ గుడి ముందు భిక్షాటన చేసుకునే వారితో కలిసి కూర్చొని అడుక్కుంటూ నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి ఇంటివద్ద లేకపోవ‌డంతో ఆయన ఢిల్లీలో ఉండటంతో ఆయన ఫ్లెక్సీకి వినతి పత్రం అందించారు. రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల అభ్య‌ర్థులు మోకాళ్ళ మీద కూర్చొని కొంగు పట్టి చాచి అడుక్కున్నారు.

- Advertisement -

గాంధీ భవన్ వద్ద నిరసన … అరెస్ట్

కాగా, పెద్ద‌మ్మ గుడి వ‌ద్ద భిక్షాట‌న చేసి నిర‌స‌న వ్య‌క్తం చేసిన అభ్యర్ధులు నాంప‌ల్లిలోని గాంధీ భ‌వ‌న్‌కు చేరుకున్నారు. డిసెండింగ్ ఆర్డ‌ర్‌లో ఉద్యోగాల భ‌ర్తీ చేప‌ట్టి, త‌మ‌కు న్యాయం చేయాల‌ని గాంధీ భ‌వ‌న్ గేటు వ‌ద్ద నిర‌స‌నకు దిగారు. వి వాంట్ జ‌స్టిస్ అంటూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. గాంధీ భ‌వ‌న్‌ను ముట్ట‌డించి నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న గురుకుల అభ్య‌ర్థుల‌ను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement